ప్ర‌భుత్వ హ‌త్య‌లు.....!

హైద‌రాబాద్‌: ఒక ఘోరం జ‌రిగిపోయింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ త‌ప్పిదాలు మొత్తంగా 30 మందికి పైగా ప్రాణాల్ని బ‌లి తీసుకున్నాయి. పుష్క‌రాల్లో తొక్కిస‌లాట చోటు చేసుకొంది. మొద‌టిరోజే జ‌రిగిన ఈ దుర్ఘ‌ట‌న తెలుగువారి మ‌దిలో ఒక విషాద వీచిక‌గా మిగిలిపోయింది.
ప్ర‌మాదం జ‌రిగింది ఇలా...........!
పుష్క‌రాల‌కు రాజ‌మండ్రి ముఖ్య వేదిక అయితే, అందులో పుష్క‌రాల రేవు అన్న‌ది ప్ర‌ధాన స్నానాల ఘ‌ట్టం. అక్క‌డ‌కు భ‌క్తులు తెల్ల‌వారు జామునుంచే చేరుకొన్నారు. వేకువ జామున క్యూ లైన్ ద్వారా వెళ్లి పుణ్య స్నానాలు ఆచ‌రించాల‌ని త‌ల‌పోశారు. కానీ ప్ర‌మాదం ముంచుకొచ్చింది. ముఖ్య‌మంతి్ర వ‌స్తున్నార‌న్న వంక‌తో భ‌క్తుల్ని తెల్ల‌వారు జాము నుంచీ నిలిపివేశారు. క్యూ లైన్ల‌లో నిలిపి వేసి చంద్ర‌బాబుకి పుణ్య‌స్నానాలు, పూజ‌ల కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దాదాపు మూడు గంట‌ల పాటు ఈ త‌తంగం కొన‌సాగింది. అప్ప‌టిదాకా భ‌క్తులు అలాగే క్యూలైన్ల‌లో వేచి ఉన్నారు. ఒక్క సారిగా క్యూలైన్ల నుంచి భ‌క్తుల్ని వ‌దిలే స‌రికి పెద్ద ఎత్తున జ‌నం ఘాట్ల ద‌గ్గ‌ర‌కు ప‌రుగులు తీశారు దీంతో తొక్కిస‌లాట చోటు చేసుకొంది.
యంత్రాంగం అత్యుత్సాహం
పుష్క‌రాల మొద‌టి రోజున అధికార యంత్రాంగం అత్యుత్సాహం చూపించింది. ముఖ్య‌మంతి్ర చంద్ర‌బాబు నాయుడు ద‌గ్గ‌ర ఎక్కువ మార్కులు కొట్టేసేందుకు పోటీ ప‌డింది. సీఎం కుటుంబానికి ఎక్కువ సేపు పుష్క‌ర విధులు చేయించేందుకు సామాన్య జ‌నాన్ని ఎక్క‌డికక్క‌డ నిలిపివేశారు. దీంతో భ‌కు్త‌లు న‌లిగిపోయారు. క‌నీసం తాగేందుకు సుర‌క్షిత తాగు నీరు కూడా క‌ర‌వైంది. యాత్రికుల హాహాకారాల్ని ప‌ట్టించుకొనే నాథుడే క‌ర‌వ‌య్యాడు. అధికార యంత్రాగం అంతా ముఖ్య‌మంతి్ర‌కి స్వాగ‌తం ప‌ల‌క‌డం, ఆయ‌న చేత స్నానాలు చేయించ‌డం, పూజ‌లు చేయించ‌డం, ఆయ‌న‌కు వీడ్కోలు ప‌ల‌క‌డం మీద‌నే దృష్టి పెట్టారు. దీంతో ప్ర‌జ‌ల్ని ప‌ట్టించుకునే నాథుడు క‌ర‌వ‌య్యాడు.
తొక్కిస‌లాట‌కు ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే కార‌ణం......!
తొక్కిస‌లాట‌కు కార‌ణం చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. వ‌చ్చిన వారిని ఒక్క‌సారిగా క్యూలైన్ల‌లోకి వ‌దిలేసి అధికార యంత్రాంగం ఎక్క‌డిక‌క్క‌డ జారుకొంది.దీంతో వేలాది భ‌క్తుల్ని ప‌ట్టించుకొనే నాథుడు క‌ర‌వ‌య్యాడు. ఫ‌ల‌తంగా తొక్కిస‌లాట చోటు చేసుకొంది. దీన్ని నియంత్రించే వ్య‌వ‌స్థ అక్క‌డ క‌నిపించ‌లేదు. ఈ లోగా మ‌హిళ‌లు, చిన్న పిల్లాలు అక్క‌డ జారి ప‌డ‌టంతో వారిని తొక్కుకొంటూ మిగిలిన వారు వెళ్లి పోయారు. ఘ‌ట‌న జ‌రిగిన‌ప్ప‌టికీ వెంట‌నే స్పందించాల్సిన అత్య‌వ‌స‌ర వ్య‌వ‌స్థ‌లేవీ ప‌నిచేయ‌లేదు. క్ష‌త‌గాత్రుల్ని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించ‌టం కూడా వీలు కాలేదు. పోలీసు వాహ‌నాలు, ప్రైవేటు వాహ‌నాల‌తో క్ష‌త‌గాత్ర‌ల్ని త‌ర‌లించాల్సి వ‌చ్చింది.
a
Back to Top