ప్రభుత్వం దిగివచ్చి ధరలు తగ్గించాలి..!

తిరుపతిః నిత్యవసర వస్తువుల  ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ... తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.  ధరలు విపరీతంగా మండిపోతుంటే చంద్రబాబుకు చీమకుట్టినట్టైనా లేదని వైఎస్సార్సీపీ కార్యకర్తలు మండిపడ్డారు. పెరిగిన ధరలతో సామాన్యుడు బతకలేని పరిస్థితిలో ఉంటే  ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 


చంద్రబాబు ప్రతి మూన్నెళ్లకోసారి ధరలు పెంచుకుంటూ పోతూ ... పేదలను ఓ పూట తిండికి కూడా నోచుకోకుండా చేస్తున్నాడని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. ఎంతసేపు అమరావతి పేరుతో భూములు దోచుకోవడం తప్ప చంద్రబాబుకు ఇంకో ధ్యాసే లేదన్నారు.  ముందుచూపు లేకుండా, మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేలుకొలుపుతామన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో ధరలను అదుపులోకి తీసుకొచ్చేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. 
Back to Top