ప్రభుత్వ పతనానికి కాకినాడ ఎన్నికలే నాంది

కాకినాడ: చంద్రబాబు ప్రభుత్వ పతనానికి కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికలే నాంది అవుతాయని ఎన్నికల ఇన్‌చార్జ్, ఎమ్మెల్యే  చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హెచ్చరించారు. నగరంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. ఏ సమస్యను కూడా చంద్రబాబు పరిష్కరించకుండా మాయ మాటలతో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాలను, అన్ని కులాలను ఆయన మోసం చేశారని ధ్వజమెత్తారు. మోసపోయిన కాకినాడలోని విజ్ఞులు టీడీపీకి కార్పొరేషన్‌ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలనే నిర్ణయానికి వచ్చారని తెలిపారు.  చంద్రబాబు చేసిన తప్పులకు, ఇచ్చిన వాగ్ధానాలపై చెంప చెల్లుమనిపించేలా ఓటు అనే ఆయుధంతో తీర్పు ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా పట్టినటువంటి చంద్రబాబు పీడను వదలించాలని కాకినాడ ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు చేసే నాయకుడు వైయస్‌ జగన్‌ ఒక్కడే అన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారన్నారు. కాకినాడ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ మేయర్‌ పీఠాన్ని కైవాసం చేసుకుంటుందని ఆయన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Back to Top