పోస్టర్లను ఆవిష్కరించిన విజయమ్మ

పులివెందుల, 23 మే 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పార్టీ వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ శివభరత్ రెడ్డి రూపొందించిన పోస్టర్లను పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ గురువారం ఆవిష్కరించారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలో శ్రీమతి విజయమ్మ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. డాక్టర్ శివభరత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టే నిరసన కార్యక్రమాల వివరాలతో ఈ పోస్టర్లను రూపొందించారు. అంతకుముందు దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్‌ తండ్రి వైయస్‌ రాజారెడ్డి పదిహేనో వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సమాధి వద్ద శ్రీమతి విజయమ్మ నివాళులర్పించారు.  రాజారెడ్డి పార్కులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. వైయస్‌ వివేకానందరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి చర్చిలో శ్రీమతి విజయమ్మ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వరప్రసాద్ సోదరుని కుమార్తె వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులను శ్రీమతి విజయమ్మ ఆశీర్వదించారు.

Back to Top