వైయ‌స్ జగన్ ధృడ సంకల్పం ఆకర్షించింది


 

 
ప‌శ్చిమ గోదావ‌రి : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డిలోని ధృడ సంక‌ల్పం త‌న‌ను ఆక‌ర్శించింద‌ని సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అన్నారు. ఆయ‌న‌లోని నిజాయితీ, మాట మీద నిలబడే తత్వం తనకు నచ్చాయని పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైయ‌స్‌ జగన్‌ను ఆయన శనివారం కలిశారు. అనంతరం పోసాని మాట్లాడుతూ..‘వైయ‌స్ జగన్‌లోని ధృడ సంకల్పం నన్ను ఆకర్షించింద‌ని, అందుకే ఆయనకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నాని తెలిపారు.  అన్ని వర్గాల సమస్యలు పరిష్కరించే నాయకుడు వైయ‌స్‌ జగన్‌. ఆయనలో సంకల్పం చూసి ఆశ్చర్యం వేసింద‌న్నారు. ఇది చరిత్రలో నిలిచిపోయే పాదయాత్ర అవుతుంద‌ని తెలిపారు. మూడు వేల కిలోమీటర్లు నడవడం అంటే మామూలు విషయం కాద‌ని, మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఆయన చేస్తున్న పాదయాత్ర అసాధారణమ‌ని పేర్కొన్నారు.  సమస్యల పరిష్కారంపై నిబద్ధత కలిగిన నాయకుడిగా ఆయనకు ఓటువేసి ముఖ్యమంత్రిని చేయండ‌ని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా..ఒక్కసారి మీరు ఓటు వేస్తే మీరే మళ్లీ మళ్లీ ఆయనను గెలిపిస్తారని వ్యాఖ్యానించారు.  

Back to Top