ప్రజాభిమానమే పార్టికి శిరోధార్యం–వైయస్‌ జగన్‌

– నన్నూరు వద్ద జగన్‌ను కలిసిన మైనార్టి నాయకులు
ఓర్వకల్లుః.నంద్యాల ఉప ఎన్నికల ప్రచార నిమిత్తం బుధవారం ఆయన హైదరాబాద్‌ నుంచి నంద్యాలకు వెళ్లుతున్న వైయస్ ఆర్ సిపి అధ్యక్షులు వైయస్ జగన్ మోహన రెడ్డి  రాక కోసం నన్నూరు మైనార్టి నాయకులు జాతీయ రహదారిపై  పెద్ద ఎత్తున తరలివచ్చి ఎదురు చూశారు.అక్కడికి చేరుకున్న జగన్మోహనరెడ్డి తన కారులో నుంచి దిగి అభిమానులతో కొద్దిసేపు ముచ్చటించారు.ఎంపిపి వెంటరమణమ్మ భర్త మోహన్‌రావు,మండల కో ఆప్షన్‌ సభ్యులు షంషుద్దీన్,మైనార్టిసెల్‌ నాయకుడు ఉశేన్‌ సర్కార్,మైనార్టి నాయకులు ఖాజామియా,షరీఫ్‌ నన్నూరు,పూడిచెర్ల,లొద్దిపల్లే,ఉప్పలపాడు,ఉయ్యాలవాడ తదితర గ్రామాలకు చెందిన పార్టి కార్యకర్తలు,అభిమానులు జననేతపై పూలు చల్లి అభిమానాన్ని పంచుకున్నారు. ఆప్యాయంగా మాట్లాడిన జగన్మోహనరెడ్డితో కరచాలనం చేసి ఫోటోలు దిగేందుకు జనం ఎగబాటు చూసిన జగన్‌ అభివాదం తెల్పడంతో జై జగన్‌ అంటు నినాదాలు చేశారు.

Back to Top