బాబు సీఎంగా ఉంటే పేదల గతి అంతే..?

చిత్తూరు: బాబు సీఎంగా ఉన్నన్ని రోజులు బడుగు బలహీన వర్గాల అభివృధ్దికి అవరోదమని వైయ‌స్ఆర్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్య‌క్షుడు, ఎమ్మెల్యే  నారాయణస్వామి అన్నారు. శుక్రవారం మండలంలోని పాదిరికుప్పం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసంధర్బంగా అంబేడ్కర్‌ ఆశయాలను గుర్తు చేసుకుని  ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు అవస్థలను తలచుకుని ఆవేదన చెందారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ వైఎస్‌ హయాంలో కులమతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తే ఇప్పడు సీఎం చంద్రబాబు తన వారికే పార్టీ నాయకులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు విచారం వ్యక్తం చేశారు. పేదలు ఆర్థికంగా సామాజికంగా అభివృధ్ది చెందాలని కలలు కన్న అంబేడ్కర్‌ సిద్దాంతాలకు తిలోదకాలిచ్చి బలహీన వర్గాలను ప్రభుత్వం అణగదొక్కతున్నట్లు పేర్కొన్నారు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఎస్సీలను విడగొట్టి ఓట్ల కోసం చిచ్చుపెట్టిన గనత చంద్రబాబుదేనన్నారు. చంద్రబాబుకు పేదల పట్ల నిజమైన ప్రేమ ఉంటే ఎన్నో అవకాశాలు కల్పించి అభివృధ్ది చేయవచ్చని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు అ«ధికారాన్ని అడ్డుపెట్టుకుని రోజుకో దాడి గూండాగిరి చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన రావణాశుర రాజ్యాన్ని తలపిస్తున్నట్లు మండిపడ్డారు. మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ లేదన్నారు. మహిళలకు పెద్ద పీట వేస్తున్నామంటూ ఊదర గొడుతున్న ప్రభుత్వం వారి అభ్యున్నతి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయిస్తోందో మహిళలు గమనించాలని సూచించారు

Back to Top