బాబు దుశ్చర్యపై వైయస్‌ఆర్‌ సీపీ విజయం

న్యూఢిల్లీ: సదావర్తి భూములను అప్పనంగా కొట్టేయాలనే చంద్రబాబు దుశ్చర్యను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ న్యాయపోరాటం చేసి విజయం సాధించిందని వైయస్‌ఆర్‌ సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు. దేవాదాయ శాఖ 83 ఎకరాల భూమిని అప్పనంగా రూ.22 కోట్లకు చంద్రబాబు బినామీలకు కట్టబెట్టిందని మండిపడ్డారు. హైకోర్టును ఆశ్రయించి ఎమ్మెల్యే ఆర్కే పోరాటం చేయడంతో భూములు రూ.60.3 కోట్ల ధర పలికిందన్నారు. ఆర్కే పోరాట ఫలితంగా ప్రభుత్వానికి రూ. 40 రోటకల ఆదాయం వచ్చిందన్నారు. ప్రజల ఆస్తులను దోపిడీకి గురైనప్పుడు కాపాడాల్సిన వ్యక్తులే తినేయాలని చేస్తున్నారన్నారు. ప్రజల ఆస్తులను కాపాడేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. 

Back to Top