మహానేత పథకాలు కొనసాగించాలి...!

దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని ...తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జలయజ్ఞంలో భాగంగా ఆమహానేత అనేక ప్రాజెక్ట్ లు చేపడితే ..ఇప్పుడున్న ప్రభుత్వం వాటి పేర్లు మారుస్తుందని మండిపడ్డారు. 
వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్రలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడిన ఆయన....వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు కొనసాగించాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముందు 17 మంది, తర్వాత ముగ్గురు సీఎంలు పనిచేశారని....కానీ వైఎస్సార్ చేపట్టినన్ని సంక్షేమ పథకాలు మరెవరూ  అమలు చేయలేదన్నారు పొంగులేటి.
Back to Top