వైఎస్సార్సీపీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం

ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్సార్సీపీకే ఉంది
టీఆర్ఎస్,కాంగ్రెస్,టీడీపీ-బీజేపీలకు బుద్దిచెప్పండి
హన్మకొండలో ఓటర్లకు పిలుపునిచ్చిన పొంగులేటి

హన్మకొండః
 టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ-బీజేపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని
 వైఎస్సార్సీపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్
రెడ్డి వరంగల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్
రెడ్డి ఆశయాలతో రూపొందిన వైఎస్సార్సీపీని గెలిపించాలని ఓరుగల్లు
ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేశారు. ప్యాన్ గుర్తుకు ఓటేసి పార్టీ  అభ్యర్థి
నల్లా సూర్యప్రకాష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ప్రజలు కష్టాల్లో
ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ఎంతో ఆదుకున్నారని, ఆమహానేత రుణం
తీర్చుకునేందుకు వైఎస్సార్సీపీని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని
ఓటర్లకు సూచించారు.  ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్సార్సీపీకి మాత్రమే
ఉందన్నారు. రాజన్న కలలు నెరవేరాలంటే తెలంగాణలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం
వస్తేనే అది సాధ్యపడుతుందన్నారు. 

తెలంగాణ వస్తే
తమ బతుకులు బాగుపడతాయని ప్రజలు  టీఆర్ఎస్ ను గెలిపిస్తే...కేసీఆర్
ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారని పొంగులేటి మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ
ఒక్క వాగ్ధానాన్ని నెరవేర్చకుండా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో పాటు
కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రజలను మోసగించాయని నిప్పులు చెరిగారు. వైఎస్
రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు రాజన్న
కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసినందునే...డిపాజిట్లు కూడా దక్కలేదని
ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ-బీజేపీల మోసాలను ప్రజలంతా
గుర్తించాలని పొంగులేటి పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు
అందించినందునే రెండు సార్లు ప్రజలు రాజశేఖర్ రెడ్డిని దీవించారని
పొంగులేటి అన్నారు.. 
Back to Top