వైఎస్సార్సీపీ అస్త్రం వైఎస్ జగన్..!

వైఎస్సార్సీపీ గెలుపు తథ్యం..!
హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలం..!

హైదరాబాద్ః
 ఈనెల 21న వరంగల్ లో జరగనున్నఎంపీ బైఎలక్షన్ లో నల్లా సూర్యప్రకాశ్
గెలుపుకోసం వైఎస్సార్సీపీ శక్తియుక్తిలన్నీ ఉపయోగిస్తామని...తెలంగాణ
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
వైఎస్సార్సీపీ అస్త్రమైన తమ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రభంజనం ముందు మిగతా
పార్టీలన్నీ కొట్టుకుపోవడం ఖాయమని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్
జగన్ ప్రచారం చేపట్టనున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులంతా
ఆనందోత్సహాలతో ఉన్నామని, వైఎస్సార్సీపీ గెలుపు తథ్యమని పొంగులేటి స్పష్టం
చేశారు. 

పేదల పెన్నిధి..!
ప్రతి
పేదవాడు  ప్రియతమ నేత,  దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డిని
ప్రేమిస్తున్నారు, ఆరాధిస్తున్నారని పొంగులేటి అన్నారు.  అర్థంతరంగా
ఆమహానేత మరణించడంతో ఉమ్మడి రాష్ట్రంలోనే ....అత్యధికంగా వరంగల్ జిల్లాలో 73
మంది చనిపోయారని పొంగులేటి తెలిపారు. ఆకుటుంబాలను ఆదుకునేందుకు ఇటీవలే
 రాజన్న కూతురు షర్మిలమ్మ ప్రత్యక్షంగా ప్రతి కుటుంబాన్ని పరామర్శించి
అండగా ఉంటామని వారిలో ధైర్యం నింపిన విషయం అందరికి తెలిసిన సంగతే.  

ప్రజా నాయకుడు..!
రైతులు,
గిరిజనులు, దళితులు, మహిళలు, మైనారిటీలు సహా అన్ని వర్గాల ప్రజలకు భరోసా
కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి అని పొంగులేటి
కొనియాడారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందించి...ప్రజల మనసు గెలిచిన
నాయకుడుగా వారి గుండెల్లో వైఎస్. రాజశేఖర్ రెడ్డి పదిలమయ్యారని పొంగులేటి
పేర్కొన్నారు.  ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో తెలంగాణ, ఏపీ సహా
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని
దుయ్యబట్టారు. 

ఫ్యాన్ గుర్తుకే మన ఓటు..!
2004
నుంచి 2009 దాకా వైఎస్సార్ ప్రజల ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ, అభివృద్ధి
కార్యక్రమాలు చేపట్టి ..వారి దీవెనలతో రెండోసారి సీఎం అయ్యారని పొంగులేటి
అన్నారు. ఆతర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన
కార్యక్రమాలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. ప్రజాసమస్యలను గాలికొదిలేసిన
టీఆర్ఎస్,బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఫ్యాన్
గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లాసూర్యప్రకాశ్ ను అత్యధిక
మెజారిటీతో గెలిపించాలని వరంగల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Back to Top