ఖమ్మంలో పొంగులేటి నిరసన దీక్ష

ఖమ్మం:
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజాసమస్యలపై ...
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
 నిరసన దీక్ష చేపట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని
డిమాండ్ చేస్తూ ఖమ్మం పట్టణంలో దీక్ష ప్రారంభించారు. 
సంక్షేమ
పథకాలు అమలు చేయాలని, ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలని ఈ
సందర్భంగా పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్‌లో
చేపట్టిన ఈ దీక్ష రెండు రోజుల పాటు కొనసాగనుంది.

ఎన్నికల్లో
ఇచ్చిన వాగ్దానాలను కేసీఆర్ తుంగలో తొక్కారని వైఎస్సార్సీపీ  నేతలు
మండిపడ్డారు. నిత్యవసర ధరలు కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం
చెందిందని విమర్శించారు. దళితులకు భూపంపిణీ కార్యక్రమం కాగితాలకే
పరిమితమైందని నేతలు ఎద్దేవా చేశారు. వైరా అసెంబ్లీ నియోజకవర్గంలో 400
ఇళ్లతో పేదలందరికీ ఎలా సర్దుబాటు చేస్తారని  సర్కార్ ను ప్రశ్నించారు.
దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ను సత్వరమే పూర్తిచేసి 6 లక్షల ఎకరాలకు
నీరిందించాలని..కిన్నెరసాని, సింగభూపాలెం, వైరా, పాలేరు రిజర్వాయర్లను
అనుసంధానం చేయాలని వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top