గ్రేటర్ ఎన్నికల పరిశీలకులను ప్రకటించిన పొంగులేటి

సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ ఎన్నికల పరిశీలకులను నియమించారు. ఈ మేరకు పరిశీలకుల పేర్లను పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ప్రకటించారు. జీహెచ్‌ఎంసీని ఐదు జోన్లుగా విభజించి, వాటికి పరిశీలకులను నియమించినట్లు ఆయన మీడియాకు చెప్పారు.

తూర్పు జోన్‌కు కె.శివకుమార్, పశ్చిమజోన్‌కు కొండా రాఘవరెడ్డి, ఉత్తర జోన్‌కు నల్లా సూర్యప్రకాష్, దక్షిణ జోన్‌కు హెచ్‌ఏ రెహ్మాన్, సెంట్రల్ జోన్‌కు మతిన్‌లను అబ్జర్వర్లుగా నియమించామన్నారు. ఈ పరిశీలకులు ఒక్కో డివిజన్‌లో అధ్యక్షుడు, అయిదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసుకొని జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటారన్నారు.
Back to Top