ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాటం :ఎంపీ పొంగులేటి

హైదరాబాద్:  తెలంగాణ లో ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాటం చేయాలని తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు, ఖ‌మ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ఈ మేర‌కు ఆయ‌న వైఎస్సార్సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌కు పిలుపు ఇచ్చారు. హైద‌రాబాద్ లోట‌స్ పాండ్ లోని కేంద్ర కార్యాల‌యంలో టీ వైఎస్సార్సీపీ రాష్ట్ర స్థాయి కార్య‌వ‌ర్గ సమావేశం జ‌రిగింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో తెలంగాణలోని కరువు, రైతు ఆత్మహత్యలు, ప్రాజెక్టుల రీడిజైన్ వంటి పలు ప్రజాసమస్యలపై చర్చించినట్లు పార్టీ నేతలు శివకుమార్, కొండా రాఘవరెడ్డి, రెహ్మాన్లు వెల్లడించారు. ప్రజల పక్షాన పోరాడేందుకు అవసరమైన కార్యచరణను రూపొందిస్తామని నేతలు వెల్లడించారు.
 
Back to Top