ఉప ఎన్నికకు కారణం కేసీఆర్


వరంగల్ లోక్ సభ నియోజక వర్గం ఉప
ఎన్నిక అభ్యర్థి మీద టీ వైఎస్సార్సీపీ కసరత్తు ముమ్మరం చేసింది. వరంగల్ పట్టణంలో
ఆదివారం తెలంగాణ వైస్ఆర్‑సీసీ నేతలు సమావేశమయ్యారు. అంతకుముందు హైదరాబాద్ లో
పార్టీ రాష్ట్ర నాయకుల స్థాయిలో భేటీ జరిగింది. పార్టీ అభ్యర్థి ఎంపికపై, ఎన్నిక వ్యూహాలపై పార్టీ నేతలు
చర్చించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్
స్వార్థపూరిత నిర్ణయంతోనే వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిందని
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
విమర్శించారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని పొంగులేటి అన్నారు.
తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ బతికే ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం
అన్ని రంగాల్లోనూ విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పాయం
వెంకటేశ్వర్లు, జిల్లాకు
చెందిన పార్టీ నేతలు హాజరయ్యారు.

 

Back to Top