ఆచారాలను మార్చేస్తాననడం అవివేకం- మిథున్ రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం
అనేది రాజకీయాలకు అతీతమైన ఆధ్యాత్మిక సంస్థ అని అందులో రాజకీయాలను చొప్పించడం ఎంతమాత్రం
సమంజసంగా లేదని పదవికి రాజీనామా చేసిన ఎంపి మిథున్ రెడ్డి అన్నారు. టిటిడిపో
ప్రభుత్వ జోక్యం మితిమీరి పోతోందన్నారు. దేవాలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు
వేసిన ప్రశ్నలపై ఎందుకంత ఉలికిపాటని, ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా ఆయనను
ఇబ్బందుల పాలు చేసేలా వ్యవహరించడంలో అర్థమేమటిని మిథున్ రెడ్డి నిలదీశారు.

చిత్తూరుకు చెందిన వాసిగా, తిరుపతిలో
చదువుకున్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గుడిలో రాజకీయాలను పక్కకు బెట్టాలని, ప్రశ్నించిన
మాత్రానే వందల సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఆచార సంప్రదాయాలను మార్చేస్తాననడం
ఎంతమాత్రం సబబు గాదన్నారు. అయిదు సంవత్సరాల అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆచారాలను
మార్చేస్తాననడం అవివేకమని, తప్పు అని ఆయన పేర్కొన్నారు.

Back to Top