రాజకీయాల్ని కలుషితం చేసిందే చంద్రబాబు.. భూమన

హైదరాబాద్) రాజకీయాల్ని
సేవగా చూడకుండా కలుషితం చేసినది చంద్రబాబు అని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
అభిప్రాయ పడ్డారు. చంద్రబాబు విశ్వాసఘాతకుడు అని స్వయంగా ఆయన మామగారు
ఎన్టీరామారావే ఎండగట్టారని గుర్తు చేశారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ
కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు గురించి
ఎన్టీయార్ మాట్లాడిన మాటల వీడియో ను చూపించారు.

చంద్రబాబు
మోసాల్ని ఎండగడుతున్నందునే వైయస్ జగన్ పట్ల దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారని
కరుణాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రగతిని వైయస్ జగన్ అడ్డుకొంటున్నారని బాబు
అంటున్నారని, కానీ, వాస్తవంలో చంద్రబాబు అవినీతిని మాత్రమే అడ్డుకొంటున్నారని
పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే వైయస్ జగన్
కోరుతున్నారని వివరించారు. 

Back to Top