రాజకీయ సన్యాసమే మేలు

నెల్లూరు(సుళ్లూరుపేట): పార్టీలు మారేదాని కన్నా  రాజకీయ సన్యాసమే మేలు అని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే సంజీవయ్య అన్నారు.  ఓ పార్టీలో గెలిచి ప్రలోభాలతో స్వలాభం కోసం మరో పార్టీలోకి మారడం దారుణమన్నారు. తాను ముగ్గురు వల్ల రాజకీయాల్లోకి వచ్చానని సుళ్లూరుపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో సంజీవయ్య తెలిపారు. తన మామ పెంచలయ్య, రాజకీయ గురువు మేకపాటి రాజమోహన్ రెడ్డి, తనపై నమ్మకముంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి శాసనసభ్యుడిని చేసిన వైయస్ జగన్ రుణం తీర్చుకోలేనిదని చెప్పారు. అదేవిధంగా తమ అభిమాన నాయకులు వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైయస్ జగన్  ప్రతినిధిగా భావించి ఓట్లు వేసిన తన ప్రజలకు..ఎప్పుడూ తలవంచి సమాధానం చేప్పే పరిస్థితి రానివ్వను అని పేర్కొన్నారు. 

Back to Top