ప‌చ్చ‌చొక్కాల‌కు తొత్తులుగా పోలీసులు

  • డీఎస్పీపై వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ఐజీకి ఫిర్యాదు
విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అధికార టీడీపీ నేత‌ల‌కు పోలీసులు తొత్తులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి కొలుసు పార్థ‌సార‌ధి విమ‌ర్శించారు. ఇటీవ‌ల‌  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు జంగా కృష్ణ‌మూర్తి పై డీఎస్పీ నాగేశ్వ‌రావు దాడి ఘ‌ట‌న‌పై బుధ‌వారం వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు ఐజీ ని క‌ల‌సి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. అనంత‌రం మాజీ మంత్రి పార్థ‌సార‌థి మీడియాతో మాట్లాడుతూ..ప‌ల్నాడు ప్రాంతంలో గుర‌జాల శాస‌న స‌భ్యుని అవినీతి కార్య‌క్ర‌మాల‌పై చ‌ర్య‌కు సిద్ధ‌మ‌ని గుర‌జాల‌, మాచ‌ర్ల శాస‌న స‌భ్యులు స‌వాల్ విసురుకున్న త‌రుణంలో విచార‌ణ‌ జ‌ర‌పకుండానే 29వ తేది  శాస‌న స‌భ్యుల‌ను గృహ‌నిర్భందం చేయ‌డం అరాచ‌క‌మ‌ని అన్నారు. అదేరోజు ఉద‌యం గుర‌జాల మాజీ శాస‌న స‌భ్యులు బ‌ల‌హీన వ‌ర్గాల‌నాయ‌కుడు జంగా కృష్ణ‌మూర్తి, టిజి కృష్ణారెడ్డి, జెడ్పీటీసి స‌భ్యులు ఎం ప్ర‌కాష్ రెడ్డి, వి రామిరెడ్డి, అంబ‌టి శేష‌గిరి రావు, బుర్రి విజ‌య్ కుమార్ రెడ్డి, స‌ర్పంచ్, వైయ‌స్ఆర్ సీపీ క‌న్వీన‌ర్ ను మ‌రో ప‌దిమంది వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని దాచేప‌ల్లి పోలీస్టేష‌న్ కు త‌ర‌లించార‌ని ఆయ‌న తెలిపారు. గుర‌జాల డీఎస్పీ నాగేశ్వ‌ర‌రావు వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కుల‌ను తిడుతూ జంగా కృష్ణ‌మూర్తిని కొట్టార‌ని ఇది చాలా దారుణ‌మ‌ని ఆయ‌న తెలిపారు. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల నాయ‌కుడు జంగా కృష్ణ‌మూర్తిపై చేయి చేసుకోవటం ప‌ద్ద‌తి కాద‌ని, వెంట‌నే డీఎస్పీ కోటేశ్వ‌ర‌రావును, ఆయ‌నకు స‌హ‌క‌రించిన సిబ్బందిని స‌స్పెండ్ చేయాల‌ని ఐజీ గారిని కోరామ‌ని ఆయ‌న తెలిపారు. జిల్లాలోని వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కుల‌ను చుల‌క‌న‌గా చూడ‌టం, అధికార‌పార్టీ వారి అండ‌దండ‌ల‌తో పోలీసులు ప‌ది సంవ‌త్స‌రాలు ఎమ్మెల్యేగా ఆన్న జంగా కృష్ణ‌మూర్తిని కొట్ట‌డం దారుణ‌మ‌ని ఆయ‌న తెలిపారు. అనంత‌రం జిల్లా అధ్య‌క్షులు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ డీఎస్పీ ప‌చ్చ‌చొక్కా తొడుక్కొన్నార‌ని, అందుకే వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కుల‌పై దాడిచేస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. దీనిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లేదంటే దీనిపై ఉధ్య‌మం చేప‌డ‌తామ‌ని వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు తెలిపారు.
Back to Top