గ‌ట్టి ఆధారాల‌తోనే సుశీల్ మీద కేసులుహైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్పై కేసు విచార‌ణ‌కు గ‌ట్టి ఆధారాలు దొరుకుతున్నాయి. వీటి ఆధారంగానే వేధింపుల కేసు నమోదు చేసినట్లు వెస్ట్జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆదివారం నగరంలోని వెస్ట్జోన్ డీసీపీ కార్యాలయంలో వెంకటేశ్వర్లు విలేకర్లతో మాట్లాడుతూ... బాధితురాలి ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చెప్పారు.
సుశీల్, డ్రైవర్ అర్థరాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. బాధితురాలిని వెంబడించిన కారు మంత్రి రావెల కిషోర్ బాబుదే అని డీసీపీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.ఈ కేసులో అన్ని అంశాలను పరిశీలించాకే సుశీల్పై నిర్భయ కేసు నమోదు చేశామని డీసీసీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. 
Back to Top