వైఎస్ జగన్ దీక్ష భగ్నం

గుంటూరు: ప్రతిపక్ష నేత
వైఎస్ జగన్ దీక్ష ను ప్రభుత్వం భగ్నం చేసింది. ప్రత్యేక హోదా కోరుతూ గాంధేయ
మార్గంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ ను పోలీసులు అదుపులోకి
తీసుకొన్నారు. బలవంతంగా ఆసుపత్రికి తరలించారు.

ఏడు రోజులుగా నిరాహార దీక్ష
చేస్తున్న వైఎస్ జగన్ ఆరోగ్యం చివరి రెండు రోజుల్లో బాగా క్షీణించింది. సర్వత్రా
ఆందోళన వ్యక్తం అయింది. సోమవారం రోజు కుటుంబ సభ్యులంతా అక్కడకి చేరుకొన్నారు.
సతీమణి భారతి 3 రోజులుగా అక్కడే మకాం చేసి ఉన్నారు. తల్లి విజయమ్మ, సోదరి షర్మిల
అక్క డకు చేరి యోగ క్షేమాలు అడిగి తెలుసుకొన్నారు.

రాత్రి బాగా పొద్దు పోయిన
తర్వాత పోలీసులు వ్యూహాత్మకంగా దీక్ష శిబిరంలోకి ప్రవేశించారు. తర్వాత ఒక్కసారిగా
జగన్ విశ్రాంతి తీసుకొంటున్న ప్రాంతానికి చేరుకొని బలవంతంగా తమ అదుపులోకి
తీసుకొన్నారు. ప్రత్యేక హోదా కోసం దీక్షను కొనసాగిస్తానని వైఎస్ జగన్ గట్టి గా
చెప్పారు. అయినా పోలీసులు మాత్రం ఆయన్ని అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి తరలించారు. 

Back to Top