పోలీసులంటే ప‌చ్చ చొక్కాల తొత్తులు


* ప‌చ్చ చొక్కాల‌కు జై కొడుతున్న పోలీసులు
*విప‌రీతంగా అధికార దుర్వినియోగం

హైద‌రాబాద్‌) రాష్ట్రంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి నెల‌కొన్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అధికార పార్టీ పెద్ద‌ల ప్రాప‌కం కోసం పోలీసులు రెచ్చిపోయి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. బుధ‌వారం నాడు న‌గ‌రి, క‌డ‌ప ల్లో జ‌రిగిన ఘ‌ట‌న‌లు ఇదే అంశాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. 

వైఎస్సార్ జిల్లాలో ..!
వైఎస్సార్ జిల్లాలో నారాయ‌ణ కాలేజీ విద్యార్థినుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై ప్ర‌భుత్వ నిర్లిప్త‌త‌కు నిర‌స‌న‌గా వైఎస్సార్‌సీపీ న‌గ‌ర బంద్ కు పిలుపు ఇచ్చింది. ప్ర‌జ‌లంతా స్వ‌చ్చందంగా బంద్ పాటిస్తుంటే, ప్రజాస్వామ్య యుతంగా ఆందోళ‌న తెలిపేందుకు ప్ర‌య‌త్నిస్తున్న నాయ‌కుల‌పై విరుచుకు ప‌డ్డారు. ముందుగానే ఎమ్మెల్యేను, మేయ‌ర్ ను ఇత‌ర ముఖ్య నాయ‌కుల్ని గృహ నిర్బంధం చేశారు. అనేక‌మందిని అరెస్టు చేశారు. 

చిత్తూరు జిల్లాలో ..! 
చిత్తూరు జిల్లాలో న‌గ‌రిలో అధికార దుర్వినియోగం ప‌రాకాష్ట‌కు చేర‌టంతో ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ సీపీ ఆందోళ‌న చేప‌ట్టింది. ఇందులో పాల్గొనేందుకు వెళుతున్న ఎమ్మెల్యేల‌ను, సీనియ‌ర్ నాయ‌కుల్ని ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకొంది. అనేక చోట్ల పోలీసు వాహనాల్ని అడ్డు పెట్టింది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి మీద‌కు పోలీసు జీపును పోనీయ‌టంతో ఆయ‌న గాయ‌ప‌డ్డారు.

Back to Top