పచ్చనేతల వాహనాల్లో పోలీసుల పహరా

విశాఖపట్నం: ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ కదం తొక్కిన యువత ఆందోళనను నీరుగార్చేందుకు పచ్చనేతలు ప్రయత్నిస్తున్నారు. శాంతియుత మౌనపోరాటానికి తరలివచ్చిన యువత, విద్యార్థుల్లో కొందరు టీడీపీ నేతలు జొరబడి.. రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. విద్యార్థులను పోలీసులవైపు ఉసిగొలిపి.. ఆందోళనను ఉద్రిక్తపరిచేందుకు ప్రయత్నించారు. అయితే, విద్యార్థులు, యువత మాత్రం శాంతియుతంగా ఉంటూ సంయమనంగా పాటించారు. శాంతియుత నిరసనకే వారు మొగ్గుచూపడటంతో టీడీపీ నేతల కుట్రలు విఫలమయ్యారు.

టీడీపీ నేతలు వాహనాల్లో పోలీసులు
ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా చేపట్టిన నిరసనపై ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. వైజాగ్‌ నగరాన్ని దిగ్బంధించిన పోలీసులు.. మరో అడుగు ముందుకేసి ఏకంగా అధికార పార్టీ వాహనాల్లోనే పహరా కాయడం గమనార్హం. టీడీపీ జెండాలు ఉన్న వాహనాల్లో పోలీసులు తిరుగుతూ కనిపించడం కలకలం రేపింది. వైజాగ్‌ను పూర్తిగా భద్రతావలయంలో పెట్టిన పోలీసులు కొన్నిచోట్ల ఏకంగా టీడీపీ నేతల వాహనాల్లో తిరుగుతూ కనిపించారు. ఇది మీడియా కంటపడటంతో వారు వెంటనే వాహనాలకు ఉన్న టీడీపీ జెండాలు, స్టిక్కర్లు తొలగించారు.

Back to Top