కదిరిలో పోలీసుల ఓవరాక్షన్

అనంతపురం: కదిరిలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఇటీవల తన వాహనంపై జరిగిన దాడికి నిరసనగా ఎమ్మెల్యే చాంద్ బాషా కదిరిలో ధర్నా చేపట్టారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాకు దిగిన వైఎస్సార్సీపీ నేతలపై డీఎస్పీ రామాంజనేయులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్యేలు చాంద్ బాషా, విశ్వేశ్వర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా అధ్యక్షడు శంకర్ నారాయణ...పోలీస్ స్టేషన్ వరకు నడుచుకుంటూ వెళ్తుండగా అరెస్ట్ చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే చాంద్ బాషాకు మద్దతుగా వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిరి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. 

కదిరి పీఎస్ వద్ద ఎమ్మెల్యేలు ధర్నా కొనసాగిస్తున్నారు. పోలీసులు అధికారపార్టీ తొత్తులా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే చాంద్ బాషా మండిపడ్డారు. తన కారుపై దాడి జరిగి మూడు రోజులవుతున్నా పోలీసులు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. పోలీసుల తీరు అప్రజాస్వామికని చాంద్ బాషా ఫైరయ్యారు.

తాజా వీడియోలు

Back to Top