<strong>ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి</strong>విశాఖ: జై ఆంధ్ర ప్రదేశ్ బహిరంగ సభకు స్థానికులను రాకుండ అడ్డుకుంటున్న పోలీసులపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. పోలీసులా..లేక పచ్చ చొక్కాలు వేసుకున్న టీడీపీ కార్యకర్తలా అని నిప్పులు చెరిగారు. పోలీసులు గౌరవంగా పార్టీ కార్యకర్తలను లోపలికి పంపాలి. మీరు కాకీ చొక్కాలేసుకున్న పోలీసులు.. పచ్చ చొక్కాలేసుకున్న టీడీపీ కార్యకర్తలు కాదని హెచ్చరించారు. వారిని ఆపితే ఉద్యమం అక్కడ్నుంచే మొదలవుతుందని, తిరగబడితే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందన్నారు. ఇది శాంతి యుతంగా జరుగుతున్న ప్రజా ఉద్యమం. ఇది అందరి సంక్షేమం కోసం జరిగేది. ఆ సంక్షేమం పోలీసుల కుటుంబాలకు కూడా చేరుతుందని చెప్పారు. దయచేసి సహకరించండి. కార్యకర్తలను సభా ప్రాంగణానికి అనుమతించాలని చెవిరెడ్డి పోలీసులను వేదిక మీద నుంచి అభ్యర్థించారు.