నిరసన మార్చ్ ను అడ్డుకున్న ఖాకీలు..!

విజయవాడః ప్రత్యేకహోదా సాధన కోసం వైఎస్సార్సీపీ తలపెట్టిన నిరసన మార్చ్ ను పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ కు శాంతియుతంగా వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకొని దారుణంగా ప్రవర్తించారు. ఎమ్మెల్యేలు , ఎంపీలని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి చెత్త వ్యాన్లలో పడేశారు. అహింసాపద్ధతిలో ర్యాలీతో వెళుతున్న నాయకులను నాలుగు అడుగులు కూడా వేయకుండానే అడ్డుకొని అరెస్ట్ చేశారు. ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రత్యేకహోదా సాధన కోసం వైఎస్సార్సీపీ సీఎం క్యాంప్ ఆఫీస్ కు నిరసన మార్చ్ కు యత్నించింది. పోలీసుల నుంచి అన్ని అనుమతులు తీసుకున్నా కూడా దౌర్జన్యంగా ర్యాలీని అడ్డుకున్నారు. ప్రత్యేకహోదాపై ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. 
Back to Top