కత్తులతో వీరంగం చేసినా అరెస్ట్ చేయరా..?

నంద్యాలః అధికార తెలుగుదేశం హత్యారాజకీయాలను పెంచి పోషిస్తోంది.  అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు కత్తులు, గన్ లతో వైయస్సార్సీపీ నాయకులపై దాడులకు తెగబడుతూ అరాచకం సృష్టిస్తున్నారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు. వైయస్సార్సీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన టీడీపీ నేత మధుపై చర్యలు తీసుకోకపోగా...శిల్పా వర్గంపైనే పోలీసులు కౌంటర్ కేసులు నమోదు చేశారు. శిల్పా చక్రపాణిరెడ్డి సహా 8మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.  అక్రమ కేసులను వైయస్సార్సీపీ నేతలు ఖండించారు. చట్టాన్ని గౌరవించి ముగ్గురు వైయస్సార్సీపీ కార్యకర్తలు పోలీసులకు లొంగిపోయారు. కత్తులతో వీరంగం సృష్టించిన అభిరుచి మధును ఎందుకు అరెస్ట్ చేయడం లేదని వైయస్సార్సీపీ నేతలు ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు. పాలకుల ఒత్తిడితోనే పోలీసులు మధును అరెస్ట్ చేయడం లేదని మండిపడ్డారు.

Back to Top