తిరుపతి పవిత్రతకు భంగం కలిగించిన విహెచ్

తిరుపతి‌, 18 ఆగస్టు 2013:

టిటిడి పవిత్రతకు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు భంగం కలిగించారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. టిటిడి నిబంధన ఉల్లంఘన కింద విహెచ్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలనిప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.‌ తిరుమలలో రాజకీయ ప్రస్థావనలేవీ తీసుకురాకూడదనే నిబంధన ఉందని చెవిరెడ్డి గుర్తు చేశారు.

వి.హనుమంతరావు శనివారం శ్రీవారి దర్శనానికి తిరుమల వచ్చి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఉండాలంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి సాధారణ ప్రజలు ఉంటే తమకు అభ్యంతరం లేదని అన్నారు. విహెచ్‌ వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన సమైక్యవాదులు అలిపిరి వద్ద ఆయన వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు.

Back to Top