సీమాంధ్రులను అవమానిస్తున్న పోలీసులు

హైదరాబాద్ :

సీమాంధ్రులను పోలీసులు సంఘ విద్రోహ శక్తులంటూ అవమానించారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 19న హైదరాబాద్‌ ఎల్.బి. స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు అనుమతి నిరాకరిచడం అంటే సీమాంధ్ర ప్రజలను అవమానించడమే అని ఆమె అన్నారు. పార్టీ సభకు అనుమతి నిరాకరించడంపై ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమా‌ర్‌రెడ్డి సమైక్య ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఒక గేమ్‌ ఆడుతుందని.. దానిలో భాగంగానే సభకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారని శోభా నాగిరెడ్డి ఆరోపించారు.

చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎ.పి. భవన్‌లో దీక్షకు దిగిన విషయాన్ని ఈ సందర్భంగా శోభా నాగిరెడ్డి గుర్తుచేశారు. చంద్రబాబుకు ఎ.పి. భవన్‌లో దీక్ష చేసేందుకు అనుమతి ఇచ్చి.. సమైక్య సభకు హైదరాబాద్‌లో అనుమతి ఇవ్వకపోవడం శోచనీయమని ఆమె నిప్పులు చెరిగారు.

Back to Top