వైయస్సార్‌సీపీ వర్గీయులను వేధిస్తున్న పోలీసులు

కొండపిః  మండలంలోని గుర్రప్పడియ గ్రామంలో సర్పంచ్‌ ఎన్నిక నేపథ్యంలో వైయస్సార్‌సీపీ వర్గీయులను పోలీసులు వేధిస్తున్నారని కొండపి నియోజకవర్గం వైయస్సార్‌సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు ధ్వజమెత్తారు.  ప్రశాంతంగా ఎన్నికలు జరగాల్సిన గ్రామంలో కొంతమంది పోలీసులే పనికట్టుకుని అధికారపార్టీకి అండదండలు అందిస్తు దగ్గరుండి ప్రలోభాలకు ఊతమిస్తున్నారని ఆరోపించారు. వైయస్సార్‌సీపీ వర్గీయుల ఇళ్ళల్లోకి పోయి సామానులు లాగి చిందరవందరగా వేసి బెడ్‌రూమ్స్‌లో సైతం వెతుకుతు మహిళలను సైతం భయబ్రాంతులకు గురి చేయటం హేయమైన చర్య అన్నారు. టిడిపి వర్గీయులు గుంపులుగా తిరుగుతు ఓటర్లను అన్ని రకాలుగా ప్రలోభపెడుతున్నా ప్రలోభాలకు లొంగని వారిని పలు రకాలుగా బెదిరింపులకు గురి చేస్తున్న పోలీసులు కిమ్మనకపోవటం దుర్మార్గమైన విషయం అన్నారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వపోకడలు పనికి రావని ఇరుపార్టిల వారికి ఒకటే న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వైయస్సార్‌సీపీ వర్గీయులను కనీసం ఇళ్ళ నుండి సైతం బయటకు రానియ్యకపోవటం అన్యాయం అన్నారు. వైయస్సార్‌సీపీకి గ్రామంలో స్పష్టమైన మోజార్టి ఉండటంతో గెలుపు మీద నమ్మకంలేని టిడిపి వర్గీయులు ఏవిధంగానైనా అడ్డదారుల్లో గెలవటం కోసం శతవిధాలా అడ్డదారుల్లో ప్రయత్నిస్తుందన్నారు. గత రాత్రి వైయస్సార్‌సీపీ నాయకులైన మునుసుబు ఇంటిలోకి సైతం వెళ్ళి పోలీసులు గందరగోళం చేయటం తీవ్రమైన చర్య అన్నారు. ఈవిషయమై ఎలక్షన్‌ కమీషన్‌ దృష్టికి , జిల్లా కలెక్టర్‌ యస్‌పి దృప్టికి సైతం తీసుకపోతామని అన్నారు. లోకల్‌ ఎన్నికలొ స్దానిక యస్‌ఐకి విధులు అప్పగించటం తగదన్నారు. అధికారులు పక్షపాతంలేకుండా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించినప్పుడే సర్పంచ్‌ ఎన్నికకు అర్ధం ఉంటుందని లేకుంటే ఇది బూటకపు ఎన్నికగా ప్రజలు అర్ధం చేసుకుంటారని అన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర సహయకార్యదర్శి డాకా పిచ్చిరెడ్డి, మండల పార్టి అధ్యక్షులు ఆరికట్ల వెంకటేశ్వర్లు, గ్రామ పార్టి అధ్యక్షులు గొట్టిపాటి మురళి, సత్యన్నారాయణరెడ్డి పాల్గొన్నారు.


Back to Top