"సేవ్ విశాఖ" మహాధర్నాకు పోలీసుల అడ్డంకులు

విశాఖపట్నం: కబ్జారాయుళ్ల కబంధహస్తాల్లో చిక్కుకున్న విశాఖ నగరాన్ని రక్షించేందుకు  ప్రతిపక్ష వైయస్సార్‌ సీపీ నిర్వహిస్తున్న ‘సేవ్‌ విశాఖ’ మహాధర్నాకు పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. ధర్నాకు వచ్చేందుకు యత్నిస్తున్న వైయస్సార్‌ సీపీ నేతలు, కార్యర్తలను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు. ర్యాలీలకు అనుమతి లేదంటూ ఆంక్షలు విధిస్తున్నారు. వైయస్‌ జగన్‌ను ఆహ్వానించేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన కార్యకర్తలనూ పోలీసులు వేధింపులకు గురిచేశారు. కార్యకర్తల వాహనాల నెంబర్లు, పేర్లు, వివరాలు తీసుకొని ఎయిర్‌పోర్ట్‌కు అనుమతించారు. పలు చోట్ల కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు బలవంతంగా తొలగించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ‘సేవ్‌ విశాఖ’ ధర్నాకు కదులుతున్నారు.

Back to Top