పోలీసుల తీరు బాధాకరం: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

గుంటూరు: అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రభుత్వాస్పత్రికి తరలించే సందర్భంలో పోలీసుల తీరు చాలా బాధాకరమని చెప్పారు. కనీస మర్యాద పాటించలేదని, ఒక ప్రధాన ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా ఓ సాధారణ స్ట్రెచర్ మీద ఆయనను అంబులెన్స్లోకి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం అండ చూసుకొని పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికార అహంబావంతో వ్యవహరించి అందరు నిద్రిస్తున్న సమయంలో పోలీసులను పంపించారని, నిద్రలో ఉన్న వైఎస్ జగన్ను బలవంతంగా నిద్రలేపి తీసుకెళ్లారని చెప్పారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కేబుల్ టీవీల, కెమెరాల వైర్లను కూడా కట్ చేశారని చెప్పారు.
Back to Top