ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అక్ర‌మ అరెస్టు

క‌ర్నూలు: ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా తెలుగుదేశం అరాచ‌కాలు మ‌రోసారి బ‌య‌ట ప‌డ్డాయి. ఎన్నిక‌ల్లో ఓటు వేస్తున్న సంద‌ర్భంగా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పై త‌ప్పుడు కేసు బ‌నాయించి పోలీసుల చేత అరెస్టు చేయించారు. ఈ సంఘ‌ట‌న స్థానికంగా క‌ల‌కలం రేపింది.

కర్నూలు జిల్లా నంద్యాల‌లోని పోలింగ్ స్టేష‌న్ లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటు హ‌క్కు వినియోగించుకొనేందుకు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వ‌చ్చారు. ఆమె పోలింగ్ స్టేష‌న్ లో ఉండ‌గా పోలీసులు చుట్టుముట్టి దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. ఈ సంగ‌తి తెలుసుకొన్న ఆమె తండ్రి, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వ‌చ్చి పోలీసుల్ని అడ్డుకొన్నారు. ఏ కార‌ణంతో యువ ఎమ్మెల్యే మీద దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. కావాల‌ని రెచ్చ‌గొట్టేందుకు ప్ర‌య‌త్నించిన పోలీసులు, అదే క్ర‌మంలో ఆయ‌న్ని అరెస్టు చేసి తీసుకొని వెళ్లారు. ఆయ‌న‌పై సెక్ష‌న్ 353, 506 కింద కేసులు న‌మోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌మి భ‌యం ప‌ట్టుకొన్న తెలుగుదేశం నేత‌లు..స్థానిక సంస్థల ప్ర‌తినిదుల్లో అల‌జ‌డి సృష్టించేందుకే ఈ అరెస్టుకు పాల్ప‌డ్డార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.
Back to Top