వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం కక్షసాధింపు

విశాఖపట్టణం:
బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వైఎస్సార్సీపీపై ప్రభుత్వం
కక్షసాధింపు ధోరణికి పాల్పడుతోంది. విశాఖ జిల్లాలో కోరుకొండ బాక్సైట్
సదస్సుకు బయలుదేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని ..పోలీసులు
చింతపల్లి సమీపంలోని లోతుగడ్డ బ్రిడ్జి వద్ద  అడ్డుకున్నారు. దీంతో, అక్కడ
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సదస్సుకు  అనుమతి లేదంటూ పోలీసులు
ఈశ్వరితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ
ఎమ్మెల్యే  బ్రిడ్జిపైనే బైఠాయించారు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
చేశారు. 
Back to Top