పొగాకు రైతులను ఆదుకోండి...!

ఒంగోలుః పొగాకు రైతులను ఆదుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ను కలిశారు. పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారని, భారీగా పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి  చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పర్యటనలో ఉన్న నిర్మలాసీతారామన్ పేర్నమిట్ట పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా  వైవి సుబ్బారెడ్డి కేంద్రమంత్రిని కలిసి పొగాకు రైతుల కష్టాలను వివరించి వినతిపత్రం అందజేశారు. 

పొగాకు రైతులకు న్యాయం చేయాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా పట్టించుకోవడం లేదని ఎంపీ తన ఆవేదనను వెలిబుచ్చారు. రైతులకు గిట్టుబాటు కల్పించడంతో పాటు ఆత్మహత్య చేసుకున్నవారికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలోనే జిల్లాకు వచ్చిన మంత్రికి వైవి సుబ్బారెడ్డి తమ విన్నపాన్ని తెలియజేయగా ఆమె సానుకూలంగా స్పందించారు.  

తాజా ఫోటోలు

Back to Top