ఎంపీ చొరవతో ఇద్దరికి పీఎం సహాయ నిధి

పులివెందుల : కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి చొరవతో ఇద్దరికి ప్రధానమంత్రి సహాయ నిధి మంజూరైనట్లు పులివెందులలోని ఎంపీ కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. కొండాపురం మండలం పాత కొండాపురంకు చెందిన ఈశ్వరరెడ్డి కుమార్తె చామల శిరీష అప్లస్టిక్‌ అనమియా అనే వ్యాధితో బాధపడుతూ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అలాగే చంద్రమోహన్‌ శ్రేష్టి హైదరాబాద్‌లోని గ్లోబెల్‌ ఆసుపత్రిలో లివర్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ చికిత్స చేయించుకుంటున్నాడు. వీరి పరిస్థితిని కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి దృష్టికి కుటుంబ సభ్యులు తేవగా.. ఆయన ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. ఇందుకు స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం వారికి ఒక్కొక్కరికి రూ.3లక్షల చొప్పున ఆసుపత్రి చికిత్సలకు నిధులు మంజూరు చేసింది.

Back to Top