ప్లీనరీని విజయవంతం చేయండి

కోట: వైయస్సార్‌సీపీ గూడూరు నియోజకవర్గం ప్లీనరీని విజయవంతం చేయాలని మండల పార్టీ కన్వీనర్‌ పలగాటి సంపత్‌కుమార్‌రెడ్డి కార్యకర్తలను కోరారు. గురువారం గూడూరు సీఆర్‌రెడ్డి కల్యాణ మండపంలో జరిగే ప్లీనిరీకి తరలిరావాలన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు,కోటను కరువు మండలాల జాబితాలో చేర్చకపోవడాన్ని ఖండిస్తూ తీర్మాణం ప్రవేశపెడతామన్నారు.ప్లీనరీకి కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Back to Top