ప్లీనరీని విజయవంతం చేయాలి

విడవలూరు: వైయస్సార్‌సీపి అధిష్టానం మేరకు ఈ నెల 16వ తేదీన కోవూరులో జరిగే నియోజకవర్గ స్థాయి ప్లీనరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన విడవలూరులోని ఆ పార్టీ కన్వినర్‌ బెజవాడ గోవర్ధన్‌రెడ్డి నివాస గృహంలో గురువారం కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరులోని రుక్మిణి కళ్యాణ మండలంలో జరిగే ఈ ప్లీనరీకి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటిరాజమోహన్‌రెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్‌లతో పాటు మన జిల్లా వైయస్సార్‌సీపి ఎమ్మెల్యేలు, చిత్తూరు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హజరవుతారని తెలిపారు. విడవలూరు మండలం నుంచి భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ ప్లీనరీకి ముందు కార్యకర్తలచే బైక్‌ ర్యాలీ ఉంటుందని, ఈ కార్యక్రమంలో అందరు పాల్గొనాలని కోరారు. వచ్చిన ప్రతి నాయకుడు, కార్యకర్త, అభిమానులను నిరాశ పరచకుండా అందరికి అన్ని అందే విధంగా కమిటీ సభ్యులు వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్‌సీపి నాయకులు వెంకయ్య, స్టాలిన్, మస్తానయ్య, మల్లికార్జున్‌రావు, బాస్కర్, రాధయ్య, సత్యం, వావిళ్ల రమణయ్య, గోవింద్, ప్రభాకర్, దేవరపల్లి శ్రీనివాసులరెడ్డి, గండవరపు వివేక్‌రెడ్డి, ప్రసాద్‌గౌడ్, జనార్ధన్‌రెడ్డి, అనిల్, సత్యం, తదితరులు పాల్గొన్నారు.

Back to Top