వైయస్‌ఆర్‌ సీపీ బలపరచే అభ్యర్థిని గెలిపించండి

పెద్దకడబూరు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ బలపరిచే అభ్యర్థులను గెలిపించాలని పార్టీ రాష్ట్ర యూత్‌ కమిటీ సభ్యుడు వై.ప్రదీప్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలకేంద్రంలోని   ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడానికి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం పచ్చ చొక్కాలకే పరిమితం చేసి అర్హులైన అభ్యర్థులకు (లబ్ధిదారులకు) తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. అలాగే మండలంలో పనిచేసే అధికారులు కూడా అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్నారని, ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను విస్మరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పింఛన్లు, గృహాలు, ఇతర పథకాలను కూడా జన్మభూమి కమిటీల పేరుతో నిధులన్నీ పచ్చ నేతల జోబుల్లోకి  దారి మళ్లుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ సీపీ మండల అధ్యక్షుడు రామ్మాహన్‌రెడ్డి, జిల్లా కార్యవర్గసభ్యుడు విజయేంద్రరెడ్డి, సీనియర్‌ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, టీడీపీ నాయకులు వీరుపాక్షిరెడ్డి,  శరణప్ప, కాంగ్రేస్‌ నాయకుడు శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top