యువ‌భేరిని విజ‌య‌వంతం చేయండి

రాప్తాడు, (అనంత‌పురం): వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 10న నిర్వ‌హించే యువ‌భేరి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌ద్దిరెడ్డి న‌రేంద్ర‌రెడ్డి పిలుపునిచ్చారు. యూత్ మండల కన్వీనర్ చిట్రేడ్డి సత్యనారాయణరెడ్డి  అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో న‌రేంద్ర‌రెడ్డి మాట్లాడారు. విభజనతో మన రాష్ట్రం పూర్తిగా వెనుకబడి ఉందన్నారు. ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమాలు, ధర్నాలు ముందుండి చేస్తూనే ఉన్నారని చెప్పారు. గతంలో రాష్ట్రంలో 9 జిల్లాల్లో యువభేరి పేరుతో ప్రత్యేక హోదా వస్తే విద్యార్థులు, నిరుద్యోగ యువతి, యువకులకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ వారిని చైతన్య వంతులు చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో కూడా యువభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అనంతపురం జిల్లా కరువు కటకాలతో కొట్టుమిట్టాడుతుందన్నారు. జిల్లాకు సెంట్రల్ యూనివర్షిటి మంజూరు చేస్తామని సీఎ బాబు ప్రకటించి మూడేళ్లు అవుతున్న ఇక్కడ విద్యార్థులకు యూనివర్షటిని నిర్మించలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు పార్లమెంటు సాక్షిగా అందరూ హామీ ఇచ్చారని, నేడు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో అనేక మంది యువతీ, యువకులు, నిరుద్యోగుల బతుకులు అంధకారంగా మారే పరిస్థితి దాపురించిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు మాట మార్చి హోదాతో పెద్దగా ప్రయోజనం ఉండదంటూ రాష్ట్ర భవిష్యత్తును చీకటిమయంగా మార్చుతున్నాడని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సునిల్ దత్తరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, రూరల మండల యూత్ ప్రసిడెంట్ బోయ చిరంజీవి, మండల కన్వీనర్ బోయ రామాంజినేయులు, యూత్ నాయకులు నాగేంద్రరెడ్డి, సాకే బాస్కర్, సింగారప్ప, చిన్న ఓబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top