ప్లీనరీని విజయవంతం చేయండి

- మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి సుబ్బారెడ్డి, శివప్రసాద్‌రెడ్డి
- దర్శిలో ప్లీనరీ వేదిక మార్పు

దర్శి : వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఆదివారం పట్టణంలో నిర్వహిస్తున్న ప్లీనరీ స్థలాన్ని మార్పు చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. తొలుత తాలూకా క్లబ్‌ ప్రాంగణంలో ప్లీనరీ నిర్వహించాలని భావించినా అక్కడ స్థలం సరిపోదన్న సీనియర్ల సూచనల మేరకు కార్యర్తలు, ప్రజల సౌకర్యార్థం ఆర్‌అండ్‌బీ బంగ్లా ఎదుట దొరబీడులో ప్లీనరీ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్లీనరీలో ప్రజా సమస్యలపై తీర్మానాలు చేస్తామని చెప్పారు. ప్రజలు ఇబ్బందులపై చర్చిస్తామన్నారు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిస్తామని వివరించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసేందుకే ప్లీనరీ.. అని స్పష్టం చేశారు. అనంతరం సుబ్డారెడ్డి, శివప్రసాద్‌రెడ్డిలు ప్లీనరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అందరికీ భోజన వసతి కల్పించనున్నట్లు తెలిపారు. ప్లీనరీకి ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, నియోజకవర్గ ప్లీనరీ ఇన్‌చార్జి వరికూటి అమృతపాణి, పార్టీ అధికారప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డిలు హాజరవుతారని చెప్పారు. 5 మండలాలల నుంచి అభిమానులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరై కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. అనంతరం మండల ప్రదాన కార్యదర్శి గోను నారాయణ రెడ్డి గృహ ప్రవేశానికి హాజరయ్యారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ వెన్నపూస వెంకటరెడ్డి, ఎంపీటీసీ సోము దుర్గారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మెత అంజిరెడ్డి, రైతు విభాగం మండల అధ్యక్షుడు ఉడుముల వెంకటరెడ్డి, బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు పీట్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి దుగ్గిరెడ్డి రమణారెడ్డి, సాగర్‌ ప్రాజెక్ట్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ సద్ది పుల్లారెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ కేవీరెడ్డి, కోరె సుబ్బారావు, ఎస్సీ సెల్‌ సభ్యులు కుంటా అచ్చారావు, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, గోను వెంగళరెడ్డి, వెన్నపూస బాపిరెడ్డి, బాలకొండారెడ్డి, బాదం చిన్నరెడ్డి పాల్గొన్నారు.

Back to Top