ప్లీనరీ సమావేశం జయప్రదం చేయండి

కొండాపురం : ఈ నెల 25వ తేదిన ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌ఛార్టీ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అధ్వర్యంలో జరుగుతున్న ప్లీనరీ సమావేశానికి మండలంలోని వైయస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్ని జయప్రధం చేయాలని మండల వైయస్సార్‌ సీపీ నాయకులు చిమ్మిలి రాజేంద్రప్రసాద్‌ కోరారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ ప్లీనరీ సమావేశానికి రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎంపీ రాజమోహన్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా, కనిగిరి నియోజక వర్గ వైయస్సార్‌ పార్టీ ఇన్‌ఛార్టీ బొర్రా మధుసుధన్‌యాధవ్, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి హాజరౌతరన్నారు. ఈ కార్యక్రమంలో గుడవళ్ళూరు సర్పంచ్‌ కామేపల్లి తిరుపతి, వైయస్సార్‌ సీపీ నాయకులు కోనేటి ప్రసాద్, చిమ్మిలి కుమార్, లక్ష్మణ్‌. ఓరుగంటి మాల్యాద్రి, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.

Back to Top