నవరత్నాల ప్లీనరీ సభను విజయవంతం చేయండి

ఉరవకొండ పట్టణంలోని గవిమఠం వెనుక వైపు వున్న శ్రీ వీరశైవ కళ్యాణ మండపంలో నేడు ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యే నవరత్నాల ప్లీనరీ సభకు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం వీరశైవ కళ్యాణ మండపంలో ప్లీనరీ ఎర్పాట్లను ఎమ్మెల్యే పార్టీ ముఖ్యనేతలతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.... నియోజకవర్గ వ్యాప్తంగా 255 పోలింగ్‌ బూత్‌ల నుండి దాదాపు 2వేల మంది బూత్‌ లెవెల్‌ కమీటి సభ్యులు ప్లీనరీకు హజరుకాబోతున్నారని తెలిపారు. వీరితో పాటు జిల్లా ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు, ఆయా మండలాల ముఖ్యనాయకులు హజరుఅవుతురని తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరుకు ప్లీనరీ సభ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ కిసాన్, ఎస్‌సీ సెల్‌రాష్ట్ర కార్యదర్శిలు తేజోనాథ్, అశోక్, బసవరాజు, మండలకన్వీనర్‌ నరసింహులు, మైనార్టీ విభాగం జిల్లా కమీటి సభ్యులు జీఎంఎస్‌ హఫీజ్, శర్మాస్, పార్టీ జిల్లా కమీటి సభ్యులు నిరంజన్‌గౌడ్, గోవిందు, మూలగిరిపల్లి ఓబన్న, ఎంపీటీసీ చందాచంద్రమ్మ, రాయల్‌మల్లి, చేనేత విభాగం జిల్లా కమీటిసభ్యులు మహేష్‌ లుపాల్గొన్నారు.

Back to Top