నవరత్నాల స‌భ‌ను విజ‌య‌వంతం చేద్దాం

లక్కవరపుకోట:  వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న‌ నవరత్నాల సభను విజయవంతం చేయాలని ఎస్‌.కోట నియోజకవర్గం ప్రజలకు జిల్లా పార్టీ వ్యవహారల సమన్వయకర్త మజ్జి శ్రీనువాస్‌రావు(చిన్న శ్రీను)పిలుపునిచ్చారు. లక్కవరపుకోట మండలం గోల్డుస్టార్‌జంక్షన్‌సమీపంలో గల కళ్యాన మండపం వద్ద లక్కవరపుకోట మండల పార్టీ కన్వీనేయర్‌గుమ్మడి సత్యనారయణ(సింగపూర్‌)ఆద్వర్యంలో నియోజకవర్గం కన్వినేయర్‌నెక్కల నాయుడుబాబు అద్యక్షతన నియోజకవర్గం పరిదిలో గల 5 మండలాకు చెందిన ముఖ్యనేతలతో సమిక్షాసమావేశం శనివారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా మజ్జి శ్రీనువాస్‌రావు పాల్గొని మాట్లాడారు. పార్టీలో అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ నెల 12వ తేది మధ్యాహ్నం 2 గంటలకు కొత్తవలస మండల కేంద్రం సమీపంలో గల రాయల్‌సిటీ వెంచర్‌ఆవరణలో నిర్వహించబోయే నవరత్నాల మహా సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు . కార్యక్రమంలో ఐదు మండలాల కన్వినేయర్‌లు కొత్తవలస,వేపాడ మండలాల మాజీ జెడ్పీటీసీలు నీలంశెట్టి గోపమ్మ,మూకల కస్తూరీ,పార్టీ సీనియర్‌నేతలు గుడివాడ రాజేశ్వరరావు,గొర్లె రవికుమార్,దుల్ల మహేష్,తదితర 5 మండలాలకు చెందిన సీనియర్‌నాయుకులు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top