పెన్షన్‌ లబ్దిదారులను ఆదుకోండి

సైదాపురం: ప్రభుత్వం ప్రతి నెల ఇచ్చే పింఛన్లు పంపిణీలో లబ్దిదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని వైయస్‌ఆర్‌ సీపీ నెల్లూరు జిల్లా ట్రేడ్‌ యూనియన్‌ కార్యదర్శి నోటి రమణారెడ్డి ఎంపీడీఓ విజయ్‌కుమార్‌ను కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయోమెట్రిక్‌ విధానం ద్వారా వేలిముద్రలు పడటం లేదన్నారు. మండలంలో అధికంగా వృద్ధులకు పింఛన్‌ నగదును ఇవ్వకపోతుండటంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి సకాలంలో పింఛన్‌నగదును అందజేసి వారిని ఆదుకోవాలని ఆయన కోరారు.

Back to Top