దీపం పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

శ్రీ‌కాకుళం(లావేరు):  దీపం పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీ రఘు సూచించారు. మండలంలోని రాయిలింగారిపేట, పాతరౌతుపేట గ్రామాలుకు చెందిన మహిళలకు దీపం పధకం ద్వారా గ్యాస్‌ కన్‌క్షలు మంజూరు అయ్యాయి. వాటిని బుధ‌వారం ఆయా గ్రామాలుకు చెందిన వారికి తామాడ సర్పంచ్‌ గొర్లె శ్రీనివాసరావు, ఎంపీటీసీ ర ఘు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మహిళలు కట్టెలు పొయ్యిలుపై వంటలు చేసి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ధీపం పధకం ద్వారా రాయితీపై గ్యాస్‌ కనక్షన్‌లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ పధకం ద్వారా మంజూరు అయిన గ్యాస్‌ కన్‌క్షలును మహిళలు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. గ్యాస్‌ వినియోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్‌ ఆదినారాయణ, స్ధానికులు గొర్లె మాధవరావు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Back to Top