<br/>హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న జల విదానాలు చేటు తెచ్చేవిగా ఉన్నాయని మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత పినిపే విశ్వరూప్ ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి లో ధవళేశ్వరం దగ్గర కనీస నీటిమట్టం కూడా ఉండటం లేదని ఆయన వెల్లడించారు. అటువంటప్పుడు అక్కడ నుంచి కృష్ణా నదికి నీటిని ఎలా తరలిస్తారు అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హడావుడిగా పనులు పూర్తి చేయించటంలోని మతలబు ఏమిటని ఆయన ప్రశ్నించారు. పనులన్నీ నాసిరకంగా ఉన్నాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.