అసెంబ్లీలో నాయ‌కుల్ని గౌర‌విద్దాం


హైద‌రాబాద్) అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌భుత్వం దిగ‌జారి వ్య‌వ‌హరిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ విమ‌ర్శించారు. హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ స‌మావేశాల్ని ప‌క్క దోవ ప‌ట్టించేందుకు ప్ర‌భుత్వం కుట్ర ప‌న్నుతోంద‌ని ఆయ‌న అన్నారు. మాజీ ముఖ్య‌మంత్రుల ఫోటోల తొల‌గింపు అనేది ఇందులో ఒక భాగం అని ఆయ‌న ఆరోపించారు. దివంగ‌త మ‌హానేత వైఎస్సార్ ఫోటోని తొల‌గించ‌టం ద్వారా ప్ర‌జ‌ల మ‌న‌స్సుల్ని గాయ‌ప‌రిచార‌ని ఆయ‌న అన్నారు. ఇత‌ర మాజీ ముఖ్య‌మంత్రుల‌కు సైతం అవ‌మానం చేశార‌ని ఆయ‌న అన్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం త‌ప్పు తెలుసుకొని, ఆయా నాయ‌కుల ఫోటోల‌ను యథాస్థానంలో ఉంచాల‌ని డిమాండ్ చేశారు. 
Back to Top