జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

హైదరాబాద్) దళితుల అభ్యున్నతి కి ఎనలేని విధంగా పాటుపడిన మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు
వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఈ వేడుకలకు
హాజరై ఫూలే చిత్రపటం దగ్గర పుష్పాలు ఉంచి అంజలి ఘటించారు. ఫూలే చేసిన సేవల్ని
స్మరించుకొన్నారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, మాజీమంత్రులు
బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే
కొడాలి నాని, సీనియర్ నాయకులు కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్య ప్రకాష్ తదితరులు
అంజలి ఘటించారు. 

Back to Top