ఫీజు దీక్షలో ఎస్వీయూ విద్యార్థుల తల్లిదండ్రులు

తిరుపతి, 7 సెప్టెంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన ఫీజు దీక్షకు మద్దతుగా గురువారం నుంచీ తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యార్థులు దీక్షను కొనసాగిస్తున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా దీక్షలో కూర్చున్నారు. కాంగ్రెస్, ‌తెలుగుదేశం పార్టీలు విద్యార్థుల కోసం చేసిందేమీ లేదని దీక్ష సందర్భంగా మాట్లాడిన పలువురు విద్యార్థుల తల్లాదండ్రులు మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఏదో ఒకటి తేల్చకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధమమని కర్నూలు జిల్లా విద్యార్థులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపేది లేదని వారు స్పష్టంచేశారు.

Back to Top